జ్యోతిష్మతిలో ఎన్‌సీసీ కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభం
తిమ్మాపూర్, జూన్ 3 (విజయక్రాంతి): జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో పది రోజులపాటు ఎన్సిసి 9 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ II బుధవారం ప్రారంభమైంది.
ఈ శిబిరం కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎ.కె. జయంత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ వి కృష్ణ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 420 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొంటుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 180 మంది క్యాడెట్లు ఇంటర్ గ్రూప్ స్పోరట్స్ షూటింగ్ కాంపిటీషన్ లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జె. సాగర్ రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ జె. సుమిత్ సాయి మాట్లాడుతూ జిట్స్ ను ఈ ప్రతిష్టాత్మక శిబిరం నిర్వహణకు ఎంపిక చేయడం గర్వకారణమని, ఇటువంటి కార్యక్రమాలు యువతలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి అనిల్ కుమార్, ఎన్సీసీ అధికారులు లెఫ్టినెంట్ జి జగదీశ్వర్, పిఐ స్టాఫ్ మహేశ్వర్ రెడ్డి, సిబ్బంది, క్యాడెట్లు పాల్గొన్నారు.






