21-01-2026 12:00:00 AM
వేములపల్లి, జనవరి 20: వేములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ సి డి స్క్రీనింగ్ తక్కువగా ఉన్నదని సిబ్బంది త్వరగా పూర్తి చేయాలని డిఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములపల్లి మండల కేంద్రంలోని పిఎస్సి కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్‌ఓ దీపా తో కలిసి ఆకస్మికంగా అవుట్ పేషెంట్స్ వివరాలు ల్యాబ్ మరియు ఫార్మసీ లను తనిఖి చేశారు. అదేవిధంగా ఎన్సీడీ, ఎం సి హెచ్, టి బి, యుమినైజేషన్ కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేషంట్ల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుచరిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.