calender_icon.png 21 January, 2026 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు, బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా ఉండటమే ప్రభుత్వ ధ్యేయం

21-01-2026 12:00:00 AM

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

బోయినపల్లి: జనవరి 20(విజయ క్రాంతి): రైతులకు బలమైన వర్గాల పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో అయిదుగురి రైతు కుటుంబాలకు రైతు బీమా ప్రెసిడెంట్ కాపీలు, 62 మందికి కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, 22 మందికి సి ఎం ఆర్ ఎఫ్ ఆర్థిక సాయం చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు అండదండగా నిలిచి అన్ని విధాలుగా సాయం అందిస్తుందని ఆయన చెప్పారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్షణం అని చెప్పారు. గత ప్రభుత్వం అందించిన పథకాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని అదనంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గూడు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేసి ఇస్తుందని చెప్పారు.

రెండవ విడత కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేసి అందిస్తూ అభివృద్ధి పనుల్లో కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తుందని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణ లు చేసి రాజకీయ లబ్ధి కోసం పబ్బం గడుపుకునే విధంగా విధంగా చవక బారు ఆరోపణ చేస్తున్నదని అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ప్రజలు వారి మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, సర్పంచులు మోహన్, మహేశ్వర్ రెడ్డి, కనకయ్య ,అంజయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.