19-06-2025 07:24:05 PM
జిల్లా కమిటీ ఎన్నికల్లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య..
జనగామ (విజయక్రాంతి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(TWJF) జిల్లా అధ్యక్షులుగా నీల నరేష్ బాబు ఏకగ్రీవ ఎన్నిక అయినట్లు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య(TWJF State President Mamidi Somaiya) తెలిపారు. గురువారం పట్టణంలోని గాయత్రి గార్డెన్స్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జనగామ జిల్లా ద్వితీయ మహాసభ జరుగగా ఈ కార్యక్రమానికి మామిడి సోమయ్య హాజరై జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.
ఈ జిల్లా కమిటీలో జిల్లా కార్యదర్శి చింతకింద కృషమూర్తి, కోశాధికారి కూచన సుప్రీం, జిల్లా ఉపాధ్యక్షులుగా చింతల మధు కృష్ణ, గంగారబోయిన జానకి రాములు, నాసాగోని శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా భాగిర్తి నరేష్, బాలయ్య, వేముల నర్సింగం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా వల్లాల జగన్, నరాబోయిన గోపాల్, ఎనమల్ల సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సబ్యులుగా గూడూరు లెనిన్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఐ ఎఫ్ డబ్ల్యూ జే జాతీయ కార్యదర్శి పులిపల్పుల ఆనందం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాల జగన్,విజయ్ కుమార్,కరీంనగర్ కార్యదర్శి బాబురావు జిల్లా జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.