రిస్క్ వద్దనే: నీరజ్
27-05-2024 01:17 AM
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా తాను గాయపడినట్లు వచ్చిన వార్తలను ఖండించాడు. తానేమీ గాయపడలేదని ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ముందు అనవసర రిస్క్ వద్దనే ఒస్త్రాకా గోల్డెన్ మీట్ నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాడు. గాయంతో ఈ నెల 28న జరగనున్న ఒస్త్రావా గోల్డెన్ స్పైక్ మీట్‌కు నీరజ్ దూరమైనట్లు వార్తలు వచ్చాయి. ‘నేనేమీ గాయపడలేదు. ఇటీవలే ఫెడరేషన్ కప్‌లో బరిసె త్రో చేయడంలో కాస్త ఇబ్బంది ఎదురైంది. అందుకే ఎక్కువ శ్రమ తీసుకోలేదు. నేను గాయపడినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ముందు రిస్క్ వద్దనే ఒస్త్రాకా గోల్డెన్ మీట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పూర్తిగా కోలుకొనే విశ్వక్రీడలకు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నా’ అని వెల్లడించాడు.






