30 August, 2026 | 5:02 AM

శ్రీహరికి రజతం

27-05-2024 01:14 AM

పారిస్: భారత స్టార్  స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ మేర్ నోస్ట్రమ్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో పతకంతో మెరిశాడు. ఫ్రాన్స్ వేదికగా ఆదివారం జరిగిన 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ ఫైనల్లో నటరాజ్  25.50 సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం సొంతం చేసుకున్నాడు. హంగేరీకి చెందిన ఆడమ్ జాస్జో (25.46 సెకన్లు) స్వర్ణం దక్కించుకోగా.. స్కాట్ గిబ్సన్ (25.64 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. అయితే ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు స్విమ్మింగ్ విభాగంలో ఇప్పటివరకు భారత్ నుంచి ఒక్కరు కూడా అర్హత సాధించలేకపోయారు. గతంలో సాజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజ్‌లు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే.