calender_icon.png 3 May, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ (యూజీ)-225 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు

03-05-2025 12:37:27 AM

  1. పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉంటుంది
  2. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలలో 1176 మంది అభ్యర్థులు

భద్రాద్రి కొత్తగూడెం, మే 2,(విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పి రోహిత్ రాజ్ తెలిపారు . మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు జరగనున్న నీట్ ప్రవేశ కు.జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల ద్వారా 1176 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావునట్లు తెలిపారు.

కొత్తగూడెంలోని సింగరేణి ఉమేన్స్ కళాశాల,పాల్వంచ లోని టి జీ ఎస్ డబ్ల్యు ఆర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించబోయే అధికారులతో శుక్రవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు సూచనలను చేయడం జరిగింది.అభ్యర్థులంతా అడ్మిట్ కార్డు నందు సూచించబడిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడును. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును.

పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను గానీ,ఆభరణాలను గానీ, షూస్, సాక్స్,బెల్ట్ లు (ఉదా : చెవి దిద్దులు,క్లిప్పులు,రింగులు, మెట్టెలు,చైన్లు మరియు ఇతర ఆభరణాలు మరియు తాళ్ళు,తాయేత్తులు) బ్యాగులు లాంటివి అనుమతించబడ వన్నారు. 

పరీక్ష కేంద్రం ప్రవేశద్వారం వద్ద పురుషులను,స్త్రీలను వేరు వేరుగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు, గుర్తింపు కార్డు మరియు రెండు పాస్పోర్ట్ ఫోటోలు, ఒక పోస్ట్ కార్డు సైజు ఫోటోను తమ వెంట తప్పనిసరిగా తీసుకొని రావలెను.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరిని ముందుగానే బయోమెట్రిక్ ద్వారా చెక్ చేసి,పరీక్ష రాసే సమయంలో వీడియోగ్రఫీ చేయడం జరుగుతుందన్నారు

పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులకు మంచినీటి సౌకర్యం మరియు అత్యవసర వైద్య సేవలకు గాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. హాజరయ్య అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లకు సంబంధించిన ఫోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవు.