calender_icon.png 4 May, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాఘవేంద్ర రాజ్‌కు కార్మిక శ్రమ శక్తి అవార్డు ప్రదానం గర్వకారణం

03-05-2025 12:39:08 AM

జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మధుయాష్కి గౌడ్

ఖైరతాబాద్, మే 2 (విజయక్రాంతి) : తెలంగాణ జలమండలి సీనియర్ నాయకులు రాఘవేంద్ర రాజ్‌కు ప్రతిష్టాత్మక కార్మిక శ్రమశక్తి అవార్డు ప్రదానం చేయడం  గర్వకారణం అని జల మండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మధుయాష్కి గౌడ్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక దినోత్సవం పరస్కరించుకొని వివిధ రంగాలలో విశేష సేవలదించిన కార్మికులను ఘనంగా సత్కరించింది. దీనిలో భాగంగా  జల మండలి కార్మికుల సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి వాటి  పరిష్కారానికి కృషి చేసినందుకుగాను రాఘవేంద్ర రాజ్‌కి ఈ అవార్డు దక్కిందని తెలిపారు.

ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన చేసిన తపన, నిబద్ధత కు ఇది ఒక మంచి గుర్తింపు అని అన్నారు. ఈ గుర్తింపు తెలంగాణ జలమండలి ఉద్యోగులందరికీ గర్వకారణం అని తెలిపారు.ఈ సందర్భంలో రాఘవేంద్ర రాజ్  స్పందిస్తూ ఈ అవార్డు తన ఒక్కడి సాఫల్యం కాదని కార్మికుల అందరి సంఘీభావం, ఆశీస్సుల ఫలితం అని అన్నారు. ఈ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని భవిష్యత్తులో మరింత విస్తృతంగా కార్మి క హక్కుల కోసం పోరాడుతానని తెలిపారు.