13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ట్రాక్టర్ బాడీపైనే ట్రాన్స్‌ఫార్మర్లు.!

28-03-2026 02:12 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల(Telkapally Mandal) పరిధిలోని గట్టు రాయిపాకుల గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గత వారం రోజుల క్రితం మరమ్మత్తుకు గురైన ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతులు చేయించి తీసుకొచ్చిన విద్యుత్ సిబ్బంది వాటిని ట్రాక్టర్ బాడీపై ఉంచి అలాగే వదిలేసిన ఘటన గ్రామంలో ఆందోళన కలిగిస్తోంది.

చిన్నపాటి వర్షం వచ్చినా,  విద్యుత్ తీగలు ట్రాక్టర్ బాడీకి తగిలినా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ట్రాక్టర్ బాడీని తాకితే ప్రాణాపాయం కలగొచ్చని వారు చెబుతున్నారు. ఇంకా ఈ ట్రాక్టర్ బాడీ గ్రామ పంచాయతీదే కావడం గమనార్హం.గ్రామ పంచాయతీకి మరో బాడీ లేకపోవడంతో గత మూడు రోజులుగా గ్రామంలో చెత్త తరలింపు పనులు నిలిచిపోయాయని గ్రామస్థులు వాపోతున్నారు. విద్యుత్ అధికారులు, గ్రామ పంచాయతీ పాలక మండలి ఇలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.