ఆర్‌టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు ప్రాణ సంకటం
అయిజ ఆగష్టు 30: ఈమధ్య ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, గతంలో ఎక్కడ ప్రయాణికులు చేయి ఎత్తితే అక్కడ బస్సు ఆపాలని నిబంధనలు ఉండేవని, ప్రస్తుతం ఆ నిబంధనలకు నీళ్లు వదిలారని, బస్టాండు మూల మలుపులో ప్రయాణికులు వచ్చిన బస్సు ఆపడం లేదని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు.మహిళలు బస్సు ఎక్కే చోట దిగే చోట కాస్త డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా పరకాస్టకు చేరుకుంటున్నాయని,
యువరక్తం కలిగిన డ్రైవర్లు స్త్రీ అనే ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బస్సు కు టార్గెట్ పెట్టడం వల్ల మహిళలు వారి ద్వారా ఆదాయం లేదనే ఉద్దేశంతోనా లేక నిర్లక్ష్యం భావనతో బస్సులు ఆపడం లేదా అని మహిళలు చర్చించుకుంటున్నారు. కావున డ్రైవర్లు ఏ వ్యక్తి ఏ అవసరంతో ప్రయాణిస్తున్నారో ఆలోచించి నడుచుకోవాలని పై అధికారులైన ఇట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులను తమ గమ్యానికి చేర్చవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






