calender_icon.png 11 August, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు

06-08-2025 12:53:19 AM

మొగుళ్లపల్లి ఘటనపై కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరిక 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఆగస్టు 5 (విజయ క్రాంతి): విద్యార్థుల సంక్షేమంలో అలసత్వాన్ని సహించేది లేదని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చ రించారు. మంగళవారం మొగుళ్లపల్లి మండలం కోర్కేశాలలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం పురుగుపడిన ఆల్పాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై కలెక్టర్ ఆరా తీశారు.

ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వహించిన నలుగురు వంటవాల్లను సస్పెండ్ చేశారు. కొత్తగా నియమితులైన వంట వారితో ముఖాముఖి మాట్లాడి జాగ్రత్తగా, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూ ప్రకారం మంచిగా వంట చేసి విద్యార్థులకు అందించాలన్నారు. సరుకుల నాణ్యతలో లోపం ఉంటే వినియోగించవద్దని, పాడైపోయిన బియ్యం, సరుకులు వినియోగించవద్దని సూచించారు.

విద్యా శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, 9949194492, 9000996933, 9441924901 నెంబర్లకు ఫోన్ చేసి సమస్యలు, ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. సమాచారాన్ని గొప్పంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. అల్పాహారంలో పురుగుపడిన ఘటనపై ఎస్వోకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డిఇఓకు సూచించారు. 

అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, వసతి గృహాల పర్యవేక్షకులు, తహసీ ల్దారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిపి ఫుడ్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నీటి సంపులను, ట్యాంకులను శుభ్రం చేయించాలని కలెక్టర్ సూచించారు.