calender_icon.png 11 August, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరస్మరణీయుడు సార్

06-08-2025 12:53:26 AM

సీఎం రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్ర సా ధనే శ్వాసగా జీవిత పర్యంతం గడిపిన ఫ్రొపెసర్ జయశంకర్ సార్‌ను తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత జయశంకర్‌సారు జయంతి (ఆగస్టు 6) సందర్భంగా రాష్ట్ర సాధనకు ఆయన చేసిన కృషిని సీఎం గుర్తు చేసుకున్నారు.   స్వరాష్ట్ర కలల జెండాను, భవిష్యత్ అజెండాను ఆయన ఎన్నడు వదిలి పెట్టలేదన్నారు.

తెలంగాణే శ్వాసగా, ధ్యాసగా, లక్ష్యంగా బతికారని, కోట్లాది జనుల్లో ఉద్యమ స్ఫూ ర్తిని రగిలించారని పేర్కొన్నారు. తన జీవితం తెలంగాణకు అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడని, ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతం, ప్రజలు ఏ విధంగా నష్టపోయారో గణాంకాలతో సహ ఎప్పటికప్పుడు వివరించార న్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలు సజీవంగా ఉంచిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్‌దేనని సీఎం కొనియా డారు. సార్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఆయన ఆశయ సాధనకు ప్రజా ప్రభు త్వం కట్టుబడి ఉందని  స్పష్టం చేశారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ ఆయువుపట్టు 

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి తెలంగాణ ప్రజా యు ద్ధనౌక గద్దర్ అని సీఎం రేవంత్‌రెడ్డి  అన్నా రు.గద్దర్ వర్థంతిని (ఆగస్టు 6) పురస్కరించుకుని ఆయన సేవలను సీఎం స్మరించుకు  న్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని, ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భం గా గుర్తు చేసుకున్నారు.

పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గద్దర్ ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా ప్రతి ఒక్కరికి కూడు, గూడు, నీడ ల భించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపర్చారన్నారు. పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మ లిదశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో గద్దర్ అగ్రగణ్యుడని గుర్తు చేశారు. ఎన్ని ఒడిదొడులకు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని కొనియాడారు.