calender_icon.png 11 August, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిటిషనర్‌ను ఎందుకు బెదిరిస్తున్నారు?

06-08-2025 12:51:24 AM

భూదాన్ భూముల కేసు వ్యవహారంలో పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 5 (విజయక్రాంతి): నాగారంలోని భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేసు ఉపసంహరించుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని పిటిషనర్ రాములు కోర్టుకు తెలిపారు. కానిస్టేబుల్ కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి గత విచారణ సందర్భంగా ఆదేశించారు. దీంతో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మంగళవారం న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఈ సందర్భం గా సీఐ వెంకటేశ్వర్లు ఆదేశం మేరకు పిటిషనర్‌కు ఫోన్ చేశానని కానిస్టేబుల్ కోర్టుకు తెలిపారు. విలేజ్ హిస్టరీ రికార్డులో వివరాల నమోదు కోసం రాములుకు ఫోన్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేసును విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్‌ణు ఎందుకు బెదిరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫిర్యాదులు మరోసారి రావొద్దని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది.