డిసెంబర్ 26 నుంచి నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలో మూడు దశాబ్దాలుగా ప్రతి ఏట అత్యంత ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్న 29వ నెహ్రూ కప్ అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు డిసెంబర్ 26 నుంచి జనవరి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నెహ్రూ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, వాతాడి దుర్గా అశోక్ లు తెలిపారు. భద్రాచలంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నెహ్రూ కప్ షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. టోర్నమెంట్లో విజేతకు రూ.50,000 వేలు, ట్రోఫీ, రన్నర్స్ కు రూ.30,000 వేలు, ట్రోఫీ వీటితో పాటు టోర్నమెంట్లో ప్రతిభ చాటిన వారికి బెస్ట్ బ్యాట్స్ మాన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తదితర అవార్డ్స్ తో పాటు వ్యక్తిగత బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొనేందుకు ఆసక్తిగల ప్రముఖ పేరొందిన క్రికెట్ జట్లు డిసెంబర్ 20వ తేదీలోగా తమ ఎంట్రీలను కన్వీనర్, ఎస్ కే సలీం, అబ్బాస్ ఫుట్ వేర్, క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా, భద్రాచలం, సెల్ 9440101108 అనే చిరునామాకు పంపించగలరని వెల్లడించారు. సమావేశంలో నిర్వాహకులు అట్లూరి శ్రీధర్, సలీం, సిద్ధూ, రాజు పాల్గొన్నారు.






