7 May, 2026 | 2:23 AM

జాతీయస్థాయి హాకీ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారిని

10-12-2024 05:56 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): జాతీయస్థాయి హాకీ పోటీల్లో సత్తా చాటిన హుజురాబాద్ క్రీడాకారిని 68వ జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ హాకీ టోర్నమెంట్ మధ్యప్రదేశ్ లోని మండోసర్ లో నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై తెలంగాణ హాకీ జట్టు 2-0 తో విజయం సాధించింది. ఈ విజయంలో హుజురాబాద్ ప్రాంతానికి చెందిన హాకీ క్రీడాకారిని నిమ్మటూరి మిధున, వర్షిత చెరో గోలు చేసి తెలంగాణ విజయంలో కీలక పాత్ర పోషించినట్లు కోచ్ వేముల రవికుమార్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. తెలంగాణ జట్టు ఢిల్లీపై విజయం సాధించడంతో హుజురాబాద్ హాకీ క్లబ్ శాశ్వత అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, కరీంనగర్ జిల్లా హాకీ క్లబ్ ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సెక్రటరీ ఉమామహేశ్వర్, క్లబ్ ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, సీనియర్ క్రీడాకారులు జీ సమ్మయ్య, హుజురాబాద్ హాకీ కోచ్ తిరునాహరి శ్రీనివాస్, బండ రఘు, కె. బిక్షపతి, సాదుల శ్యాం కుమార్, రమేష్, తిరుపతి, రాజేష్, సాయి కృష్ణ, ఎం విక్రం శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.