బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యం
పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆరు గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ బోథ్ నుండి గుడిహత్నూర్ వరకు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆనంతరం మండల కేంద్రంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి గద్దె నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే బీజేపీ లక్ష్యం అన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి అయిన హామీలను అమలు చేయలేదన్నారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవ్ రావ్, భీంరెడ్డి, మయూర్ చంద్ర, బాబారావు పటేల్, కొల్లూరి శేఖర్,కేంద్రే లక్ష్మణ్, శివ, కేంద్రే కుమార్ తదితరులు పాల్గొన్నారు.






