calender_icon.png 11 May, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘట్‌కేసర్‌లో బీవోఎం నూతన శాఖ ఏర్పాటు

05-03-2025 01:34:39 AM

రాష్ట్రంలో 73కు పెరిగిన బీవోఎం శాఖలు

హైదరాబాద్, మార్చి 4: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) నూతన శాఖ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌లో ప్రారంభమైంది. ఘట్‌కేసర్‌లోని శివారెడ్డిగూడలో బ్యాంకు జోనల్ మేనేజర్ డీఎస్‌డీ ప్రసాద్ బీవోఎం శాఖను మంగళవారం ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లోని ప్రజలకు ఈ బ్యాంకు సేవలందిస్తోంది.

ఘట్‌కేసర్‌లో కొత్త శాఖ అందుబాటులోకి రావడంతో బీవోఎం శాఖల సంఖ్య 73కు చేరింది. బీవోఎం శాఖను ప్రారంభించిన అనంతరం జోనల్ మేనేజర్ డీఎస్‌డీ ప్రసాద్ మాట్లాడుతూ... ఘట్‌కేసర్‌లోని బీవోఎం కొత్తశాఖ స్థానిక ప్రజల బ్యాంకింగ్, ఆర్థిక అవసరాలను తీరుస్తుందని అభిప్రాయపడ్డారు.

అనంతరం డిప్యూటీ జోనల్ మేనేజర్ కేఈ హరికృష్ణ మాట్లాడుతూ కొత్త శాఖను ప్రారంభించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్, డిప్యూటీ జోనల్ మేనేజర్‌తోపాటు ఆ బ్రాంచికి సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు.