calender_icon.png 9 January, 2026 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీకి కొత్త ఊపు

08-01-2026 01:14:28 AM

త్వరలో శ్రీకారం చుట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఐటీ ఎగుమతులు, ఉపాధి పెంపే లక్ష్యం

  1. దావోస్ వేదికగా జీసీసీ రోడ్ షో రూపకల్పన
  2. ప్రధాన సవాలుగా అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత
  3. అధిగమించేందుకు పరిశ్రమల కన్సల్టెంట్ల నియామకంపై దృష్టి

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి) : తెలంగాణలో ఐటీ రంగ అభి వృద్ధి వేగం పెంచేందుకు రాష్ర్ట ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నది. ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంలోనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీ సీ) పాలసీ, ఇమేజ్ 2.0 పాలసీలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గ్లోబల్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాల ను పెంచడమే లక్ష్యంగా ఈ పాలసీలను అమలు చేయనుంది. ఐటీ రం గంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించింది.

ఐటీ ఎగుమతులు రూ. 3.60 లక్షల కోట్లకు చేర్చడంతోపాటు 11 లక్షలకుపైగా ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టు కుంది. గత ఆర్థిక సంవత్సరాలతో పోలి స్తే ఈ లక్ష్యలు గణనీయంగా పెరిగా యి. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఐటీ సామర్థ్యాన్ని చాటేందుకు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం-దావోస్ సమావేశాల సందర్భంగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో జీసీసీ పెట్టుబడుల కోసం రోడ్‌షో నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను రాష్ట్రానికి ఆకర్షించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

అయితే ఐటీ ప్రమో షన్లకు అవసరమైన అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత ఇప్పుడు ప్రధాన సవాల్‌గా మారుతోం ది. బ్యాక్‌ఫిల్ పోస్టులు భర్తీ చేయడానికి తగిన నైపుణ్యం గల సిబ్బంది అందుబాటులో లేకపోవడం ప్రభుత్వానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో పరిశ్రమల అనుభవం ఉన్న కన్సల్టెంట్లను నియమించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

పరిశ్రమల నుంచి నేరుగా నిపుణులను తీసుకొచ్చి ఐటీ పెట్టుబడుల ప్రోత్సాహం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. జీసీసీ, ఇమేజ్ 2.0 పాలసీలతో పాటు అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాల ద్వారా తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచ ఐటీ మ్యాప్‌లో మరిం త బలమైన స్థానం దక్కించాలన్న దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.

దావోస్ వేదికగా జీసీసీ రోడ్ షో..

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఆకర్షించే లక్ష్యంతో రోడ్ షోను నిర్వహించనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీలను తెలంగాణకు ఆకర్షించడం, హైదరాబాద్‌ను ప్రధాన జీసీసీ హబ్‌గా ప్రచారం చేయడం, ఐటీ, డిజిటల్ సేవలు, ఆర్ అండ్ డీ రంగాల్లో పెట్టుబడులు పెంచడమే ముఖ్య ఉద్దేశంగా నిర్దేశించుకున్నది.

ఈ రోడ్‌లో గ్లోబల్ సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో వన్- టు -వన్ సమావేశాలు, జీసీసీ పాలసీ, ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్)పై ప్రజెంటేషన్లు, యూరోప్, అమెరికా, ఆసియా కంపె నీలతో పెట్టుబడి చర్చలు, తెలంగాణ ఐటీ ఎకోసిస్టంపై అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయనున్నారు. దీని ద్వారా కొత్త జీసీసీల స్థాపనకు మార్గం సుగమం, భారీ పెట్టుబడులు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు, ఐటీ ఎగుమతుల వృద్ధి, ప్రపంచ ఐటీ మ్యాప్‌లో తెలంగాణ స్థానం మరింత బలపడటం వంటి ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రానికి చేకూరనున్నాయి. 

జీసీసీ పాలసీ..

గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) పాలసీ అనేది ప్రపంచంలోని పెద్ద బహుళజాతి సంస్థలు తమ టెక్నాలజీ, ఐటీ, రీసెర్చ్, డిజైన్, ఫైనాన్స్, డేటా అనలిటిక్స్ వంటి కీలక కార్యకలాపాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించే ప్రభుత్వ విధానం. గ్లోబల్ కంపెనీలను తెలంగాణకు ఆకర్షించడం, అధునాతన ఐటీ, డిజిటల్ సేవల రంగంలో పెట్టుబడులు పెంచడం, ఉన్నత నైపుణ్యాలున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మరింత బలోపేతం చేయడమే జీసీసీ పాలసీ ముఖ్య ఉద్దేశం.

జీసీసీల ద్వారా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సర్వీసులు, బ్యాక్‌ఆఫీస్ ఆపరేషన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతారు. జీసీసీ అమలుతో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి ఉద్యోగాలు కల్పన సాధ్యమవుతుంది. రాష్ట్ర ఆదాయం, అంతర్జాతీయ గుర్తింపు పెరుగుతుంది.

సవాల్‌గా సిబ్బంది కొరత..

తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కొత్త పాలసీలు, అంతర్జాతీయ రోడ్‌షోలు చేపడుతున్నప్పటికీ, వాటిని అమలు చేసే స్థాయిలో అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత ఇప్పుడు ఒక పెద్ద సవా ల్‌గా మారింది. ఐటీ ప్రమోషన్లు, గ్లోబల్ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక నైపుణ్యాలు, అంతర్జాతీయ అనుభవం ఉన్న అధికారులు అవసరం. ఖాళీగా ఉన్న పోస్టులకు బ్యాక్ ఫిల్ చేయడానికి తగిన అర్హతలున్న సిబ్బంది అందుబాటులో లేకపోవడం, వేగంగా మారుతున్న టెక్నాలజీ ట్రెండ్స్‌కు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగంలో స్కిల్ గ్యాప్ ఉండటం ప్రధాన సమస్యగా మారుతుంది.

దీంతో పెట్టుబడి చర్చలు ఆలస్యం కావడం, అంతర్జాతీయ కంపెనీలతో సమర్థవంతమైన ఫాలోఅప్ లేకపోవడం, పాలసీల అమలు వేగం తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ఈ సవాల్‌ను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల నుంచి నేరుగా అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లను నియమించాలనే దిశగా ఆలోచిస్తోంది. దీని ద్వారా ఐటీ ప్రమోషన్లు, జీసీసీ పెట్టుబడుల సమీకరణకు అవసరమైన నైపుణ్య లోటును పూరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

ఈ నేపథ్యంలోనే పరిశ్రమల కన్సల్టెంట్ల నియామకంపై దృష్టి పెట్టింది. గ్లోబల్ కంపెనీలతో నేరుగా సంప్రదింపులు, జీసీసీ పాలసీ అమలు, ఇన్సెంటివ్స్ రూపకల్పనలో సహకారం, దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై పెట్టుబడి ప్రచారానికి వ్యూహాత్మక మద్దతు, ఐటీ ప్రమోషన్లలో ప్రభుత్వానికి టెక్నికల్ అడ్వైజరీ అంశాల్లో కన్సల్టెంట్లు కీలక పాత్ర పోషిస్తారు.

ఈ క్రమంలో కన్సల్టెంట్ల నియమించుకోవడం ద్వారా పెట్టుబడి చర్చల వేగం పెరగడం, కొత్త జీసీసీల స్థాపనకు దారితీయడం, ఐటీ ఎగుమతులు, ఉపాధి లక్ష్యాల సాధన సులభతరం చేయాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఐటీ రంగంలో తెలంగాణ లక్ష్యాలను వేగంగా సాధించేందుకు ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తున్నది. 

ఇమేజ్ 2.0 పాలసీ..

ఇమేజ్ 2.0 (ఇన్నోవేషన్ ఇన్ మల్టి మీ డియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎం టర్‌టైన్‌మెంట్) పాలసీ అనేది తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన మీడియా ఎంటర్టైన్మెంట్ రంగ అభివృద్ధి విధానం. ఇది ఇప్పటికే అమలులో ఉన్న ఇమేజ్ పాలసీకి ఆధునిక రూపంగా అధికారులు చెబుతున్నారు.

ఇమేజ్ 2.0 పాలసీతో యానిమేష న్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో తెలంగాణను జాతీయ హబ్‌గా మార్చడం, కొత్త టెక్నాలజీల ఆధారంగా సృజనాత్మక పరిశ్రమలను ప్రోత్సహించడం, యువతకు క్రి యేటివ్, హైస్కిల్ ఉద్యోగాలు కల్పించడం సాధ్యమవుతుంది.

యానిమేషన్ అండ్ వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ (మొబైల్, కన్సోల్, స్పోర్ట్స్, ఫిల్మ్ అండ్ డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్, ఏఆర్,వీఆర్, ఎక్స్‌ఆర్ టెక్నాలజీలు, మెటావర్స్, డిజిటల్ స్టోరీటెల్లింగ్ వంటి రంగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. దీంతో క్రియేటివ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెరుగుతాయి, గ్లోబల్ ప్రొడక్షన్ హౌసులు, గేమింగ్ కంపెనీలు రాష్ట్రానికి వస్తాయి.