calender_icon.png 9 January, 2026 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు జరగాలి

08-01-2026 01:15:22 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 

కామారెడ్డి, జనవరి 7 (విజయక్రాంతి): మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హై స్కూల్లో రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

53వ బాల వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ మన ప్రదర్శనలను విద్యానికేతన్ హై స్కూల్లో అబ్దుల్ కలాం ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. చిన్న వయసులోనే పరిశోధనాత్మక ఆలోచనలు అలవాడితే భవిష్యత్తులో దేశ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందన్నారు.

విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నామానాలు ప్రశంసనీయమని వారికి మార్గ నిర్దేశం చేసిన ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యాశాఖ చేప చేపట్టే ఏ కార్యక్రమానికైనా తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థుల్లో నూతన కొరవడిని పెంచే విధంగా విద్యాశాఖ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించడంలో సైన్స్ టీచర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.

ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణలకు ప్రేరణ ఇచ్చి భవిష్యత్తు శాస్త్రవేత్తలను తయారు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ గత 15 రోజులుగా 27 కమిటీలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను ప్రతి కమిటీకి గెలిచాడాన్ని కన్వీనర్‌గా నియమించినట్లు తెలిపారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిరంతరం సమీక్షిస్తూ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

విద్యార్థులందరూ కూడా సౌకర్యవంతమైన వాతావరణంలో తమ ప్రదర్శనలను ప్రదర్శించి ఉన్నతమైన ప్రదర్శనలను సౌత్ ఇండియా స్థాయికి చేరాలని ఆశీర్వదించారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కామారెడ్డి లో జరగడానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు.కామారెడ్డి జిల్లాలో ఎక్కడలేని విధంగా జిల్లా కలెక్టర్ గారి సాయంతో స్క్రాయి వాచ్ క్లబ్బులు ఇస్రో పర్యటనలు ఎన్నోవేషణల కొరకు ప్రోత్సాఖాలు వంటి వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.

విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల జిజ్ఞాస పెరుగుతుందన్నారు. విద్యాశాఖ తరఫున చేస్తున్న ప్రయత్నాలకు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సహాయ సహకారాలు అంది స్తూ సైన్స్ రంగంలో మన జిల్లా వాసులు ముందుకు వెళ్లడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎస్ ఆర్ డి డైరెక్టర్ రమేష్, ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి లు అతిథులుగా పాల్గొన్నారు. 33 జిల్లాల నుంచి విద్యార్థులు తమ ప్రదర్శనలను ప్రదర్శించేందుకు ఉపాధ్యాయులతో కలిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి, రాజ్ గంగారెడ్డి, టిపిఆర్‌టియు జిల్లా అధ్యక్షులు మనోహర్ రావు, ప్రతాప్ రెడ్డి, ఆయా ఉపాధ్యాయ సం ఘాల జిల్లా ప్రతినిధులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ లు లోయపల్లి నర్సింగ్ రావు, పండ్ల రాజు, విద్యానికేతన్ హై స్కూల్ ప్రోప్రైటర్ కవి, ప్రిన్సిపల్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.