ఇక డిజిటల్ రూపంలోనే పాలసీలు
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మీరు కొత్తగా తీసుకునే బీమా పాలసీలను డిజిటల్ రూపంలోనే అట్టిపెట్టుకోవాలి. ఇన్వె స్టర్లు వారి షేర్లను డీమ్యాట్ ఖాతాలో ఎలా ఉంచుకుంటారో అదే తరహాలో ఇన్సూరెన్స్ పాలసీలను దాచుకోవాలి. అందుకు ఒక ప్రత్యేక డిజిటల్ ఖాతాను తెరవాలి. బీమా కంపెనీలు సైతం ఇక నుంచి ఎలక్ట్రానిక్ రూపంలోనే పాలసీలను జారీ చేస్తాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఒక నోటిఫికేషన్‌లో తెలియపర్చింది. అయితే పాలసీ హోల్డర్ల ప్రయోజనాల దృష్ట్యా భౌతిక రూపంలో పాలసీ డాక్యుమెంట్‌ను పొందే చాయస్‌ను తప్పనిసరిగా ప్రపోజల్ ఫారం లో పొందుపర్చాలని పేర్కొంది.
ఈ ఇన్సూరెన్స్ అకౌంట్
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అంటే డిజిటల్ ఫార్మాట్‌లో బీమా పాలసీలను తీసుకోవ డం. డిజిటల్‌గా ఉండే ఇన్సూరెన్స్ పాలసీని మీ ఈ అకౌంట్ లేదా ‘ఈఐఏ’లో స్టోర్ చేసుకోవాలి. ఈ ఖాతా ల్ని నాలుగు ఇన్సూరెన్స్ రిపాజిటరీలు అం దిస్తున్నాయి. అవి..ఎన్‌ఎస్‌డీఎల్ డాటాబేస్ మేనేజ్‌మెంట్ (ఎన్‌డీఎంఎల్), సెంట్ర ల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఆఫ్ ఇండియా, సీఏఎంఎస్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ, కార్వీ లు. మీ జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా పాలసీలన్నింటినీ ఈ అకౌం ట్ ద్వారానే నిర్వహించుకోవచ్చు.
ఇది తప్పనిసరా?
ఏప్రిల్ 1 నుంచి పాలసీలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాలంటూ బీమా కంపెనీలను ఐఆర్ డీఏఐ ఆదేశించినప్పటికీ, పాలసీదారు కోరితే ఫిజికల్ రూపంలో కూడా పాలసీ డాక్యుమెంట్‌ను ఇవ్వాలని సూచించింది. ప్రస్తుత పాలసీలను డిజిటల్ రూపంలో మార్చుకోవడానికి సంబంధించి ఐఆర్‌డీఏఐ ఇప్పటివర కూ ఎటువంటి మార్గదర్శకాలను జారీచేయలేదు.






