9 July, 2026 | 3:36 AM

సీనియర్ సిటిజన్లకు ఏది బెస్ట్

12-05-2024 12:05 AM

ఎస్‌సీఎస్‌ఎస్ x ఎఫ్‌డీ

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) సీనియర్ సిటిజన్లకు దాదాపు అన్ని బ్యాంకులు అధిక వడ్డీనే ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు చిన్న మొత్తాల పొదుపులో భాగంగా పోస్టాఫీసుల్లో లభిస్తున్న ప్రత్యేక స్కీము సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీము (ఎస్‌సీఎస్‌ఎస్)పై కూడా ఇతర పోస్టల్ పథకాలకంటే వడ్డీ ఎక్కువే వస్తుంది. ఎఫ్‌డీలు, ఎస్‌సీఎస్‌ఎస్ మధ్య పలు సారూప్యతలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకతలూ ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు ఐదేండ్ల కాలపరిమితిగల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అందిస్తున్న వడ్డీ రేట్లు, ఇతర ముఖ్యమైన ఫీచర్లు చూద్దామా...

అర్హత

ఎస్‌సీఎస్‌ఎస్‌ను 60ఏండ్లు పైబడిన వారు ప్రారంభించుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు 55 సంవత్సరాలకు మించి 60 ఏండ్లలోపు ఉన్నప్పటికీ, రిటైర్‌మెంట్ నిధులు అందిన ఒక నెలరోజుల్లోపు పెట్టుబడి చేసుకుంటే ఎస్‌సీఎస్‌ఎస్‌కు అర్హులవుతారు. అలాగే రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు 50 ఏండ్ల మధ్యలో రిటైర్‌మెంట్ ప్రయోజనాలు లభించిన నెలలోపు మదుపు చేసుకునే వీలున్నది. సీనియర్ సిటిజన్స్ ఎఫ్‌డీని 60 ఏండ్లు దాటినవారు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. 

వడ్డీ రేట్లు

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీము వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ త్రైమాసికానికి ఒకసారి సమీక్షించి నిర్ణయిస్తుంది. ఈ ఏప్రిల్ త్రైమాసికంలో ఎస్‌సీఎస్‌ఎస్‌పై 8.2 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అదే  ఫిక్స్ డ్ డిపాజిట్లకైతే బ్యాంకులు ముందు తెలియపర్చకుండానే వడ్డీ రేట్లను మారుస్తుం టాయి. ఈ మార్పులు ఒక్కో బ్యాంకుదీ ఒక్కో తీరులో ఉంటాయి. అంతేకాదు మీరు చేసే రెగ్యులర్ ఐదేండ్ల ఎఫ్‌డీకి, లేక ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీకి (రూ.1.50 లక్షల పన్ను మినహాయింపు) వడ్డీ వేరువేరుగా ఉండవచ్చు. 

డిపాజిట్ పరిమితి
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీము (ఎస్‌సీఎస్‌ఎస్)లో గరిష్ఠంగా రూ.30 లక్షలవ రకే డిపాజిట్ చేయడాన్ని అనుమతిస్తారు. అదే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెట్టుబడి పరిమితి ఏదీ లేదు. మీరు చేసే రెగ్యులర్ డిపాజిట్, ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్‌కు వడ్డీ రేట్లలో బేధం ఉంటుంది. కాలపరిమితి ఒక టే అయినా,  రూ. 2 కోట్లలోపు లేదా అంతకుమించి చేసే డిపాజిట్లనుబట్టి కూడా వడ్డీ రేట్లలో తేడాలుంటాయి.

టీడీఎస్
వార్షిక వడ్డీ ఆదాయం రూ.50,000 మించితే ఎస్‌సీఎస్‌ఎస్, ఫిక్స్‌డ్ డిపాజిట్..రెండింటికీ టీడీఎస్ (ట్యాక్స్ డిడెక్షన్ ఎట్ సోర్స్) వర్తిస్తుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్జించే వడ్డీ రూ.50,000 లోపు ఉంటుందని మీరు పోస్టాఫీసు లేదా బ్యాంక్‌లో ఫారం 15జీ/15హెచ్ సమర్పిస్తే టీడీఎస్ కోత విధిం చరు. 

పన్ను ప్రయోజనాలు 
ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఐదేండ్ల కాలానికీ రూ.1.5 లక్షలవరకూ ఆదాయపు పన్ను మిన హాయింపు వర్తిస్తుంది. అదే ట్యాక్స్ సేవింగ్స్ బ్యాంక్ ఎఫ్‌డీని తీసుకునేవారికి ఆదాయపు పన్ను మినహాయింపు లభించాలంటే ఐదేండ్లు, అంతకుమించి ఎఫ్‌డీని అట్టిపెట్టుకోవాలి.