డాల్ఫిన్ హాస్పటల్‌ను ప్రారంభించిన సినీ నటి మెహరీన్
ముకరంపుర, మార్చి 25 (విజయక్రాంతి): సినీ హీరోయిన్ మెహరీన్ పిర్జాద్... హాయ్ కరీంనగర్ అంటూ సందడి చేసింది. బుధవారం సుభాష్ నగర్ లోని డాల్ఫిన్ హాస్పిటల్‌ను ఆమె ప్రారంభించారు. ఆస్పత్రిలోని వివిధ శాఖలకు సంబంధించిన వాటిని సందర్శించి యజమాన్యంతో కలిసి వాటిని ప్రారంభించారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలు.. అనుభవజ్ఞులైన బృందంతో మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో నమ్మకమైన సేవలను అందించేందుకు ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, కార్పొరేటర్ వైద్యులు అంజన్ కుమార్, ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్ బి రమేష్, డాక్టర్ కే సురేష్ కుమార్, డాక్టర్ కంది ప్రశాం త్ రెడ్డి, డాక్టర్ ఏ హృదయ రంజన్, డాక్టర్ హర్ష మందల, డాక్టర్ దీప గంజి, బి రేణుక, కంది నమ్రత, మేనేజర్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.




