13-01-2026 03:52:17 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఈనెల 16న నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వేదిక నిర్మాణం గ్యాలరీ ఇతర పనులను రూట్ మ్యాప్ అడిగి తెలుసుకున్నారు ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అదన కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులు పాల్గొన్నారు