1 August, 2026 | 9:40 PM

కమ్ముకొస్తున్నయుద్ధ మేఘాలు?

24-05-2024 01:31 AM

జూన్ 18న మూడో ప్రపంచ యుద్ధం  

ప్రముఖ జ్యోతిష్యుడు కుశాల్ కుమార్ అంచనా

న్యూఢిల్లీ, మే 23 : ఇరాన్ ఇజ్రాయిల్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాల నేపథ్యంలో అతి త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని భారత్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు కుశాల్ కుమార్ అంచనా వేశాడు. మరికొద్ది వారాల్లోనే మరో ప్రపంచ యుద్ధం రాబోతోందని పేర్కొన్నాడు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్టు ప్రకారం.. ‘ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, యుద్ధ పరిస్థితులకు సంబంధించి 2024 ఏడాదిని ఆందోళన కలిగించే సంవత్సరంగా చెప్పవచ్చు. కొరియా, చైనా తైవాన్, ఇజ్రాయిల్, ఉక్రెయిన్ ఇతర మధ్యప్రాచ్యం దేశాల్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు’ అని పేర్కొన్నారు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా మరో ఏడుగురు విమాన ప్రమాదంలో చనిపోవడాన్ని గుర్తు చేస్తూ.. కీలక పరిపాలనా స్థానాల్లో ఉన్న వ్యక్తులకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించారు. కొన్ని దేశాల అధ్యక్షులు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవచ్చు లేదా రాజీనామా చేయొచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 జూన్ 18న మూడోప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పారు.