25 June, 2026 | 3:22 PM

Breaking News

మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్   •   తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.   •   దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం   •   ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి   •   విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు   •   నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి   •   కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు   •   పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు   •   చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు   •  

నేటినుండి నూతన పెద్దమ్మ తల్లి ఉత్సవాలు..

05-06-2025 10:57 PM

విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ కార్యక్రమాలు..

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి నూతన దేవాలయములో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నేటి నుండి మొదలవుతుందని ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులు తెలిపారు. శుక్రవారం నాడు గణపతి పూజ, పుణ్యా వచనం కార్యక్రమాలు వేద పండితులు చేత మొదలవుతాయి, శనివారం గురు ప్రార్ధన, వేద పారాయణం, ప్రాతఃకాల పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదివారం నాడు విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది, అనంతరం మహాన్నదాన వితరణ కార్యక్రమం కొనసాగుతుందని ముదిరాజ్ సంఘ సభ్యులు తెలిపారు.