calender_icon.png 15 December, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదయ్యకు నూతన సర్పంచ్ సంతోష్ యాదవ్ పరామర్శ..

14-12-2025 06:43:34 PM

మర్రిగూడ (విజయక్రాంతి): మండలంలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గార్లపాటి యాదయ్య తండ్రి ముత్తయ్య ఆదివారం మరణించారు. విషయం తెలుసుకున్న నూతన గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కారాల కొరకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ముత్తయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సానుభూతి వ్యక్తపరచిన ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.

ప్రజాభిమానంతో సర్పంచిగా గెలుపొందిన తాను ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని అన్నారు.ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి తనని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకి సర్పంచిగా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, గ్రామ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళతానని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలబడి ఆదుకుంటానని హామీ ఇచ్చారు.ఆయన వెంట వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.