calender_icon.png 15 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి భారతీయుడు రాజ్యాంగం చదవాలి

14-12-2025 06:28:12 PM

356వ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జ్ఞానమాల

అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య

మేడిపల్లి (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 356వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ భగవద్గీత, బైబిల్, కురాన్ మత గ్రంథాలతో పాటు ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలి, అప్పుడే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, విధులు, బాధ్యతల  తెలుస్తాయని, భారత దేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి, అప్పుడే భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశంగా విరజిల్లుతుంది అని నత్తి మైసయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీరాములు, గరుగుల యాకయ్య, చిల్ల అంజయ్య, సాయి బండారి, ఏసు రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.