calender_icon.png 13 August, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ ఆల్ మేవా రాష్ర్ట నూతన కమిటీ ఎన్నిక

11-08-2025 01:45:46 AM

- ప్రకటించిన అధ్యక్షులు మహమ్మద్ మూస..

ముషీరాబాద్,ఆగస్టు10(విజయక్రాంతి): గతంలో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు టీ అల్ మేవా రాష్ర్ట నూతన కమిటీ అధ్యక్షులు మహమ్మద్ మూస ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ జరిగిన టీ అల్ మేవా రాష్ర్ట కమిటీ రిజిస్టర్ సొసైటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటు నూతన అడ్ హక్ కమిటీని ఆయన ప్రకటించి మాట్లాడారు.

కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు కమిటీ రాష్ర్ట అధ్యక్షుడు గులాం ఖాజా మోయినుద్దీన్ మరణం తర్వాత రాష్ర్ట కమిటీ స్తబ్దంగా ఉండిపోయిందని అన్నారు. భవిష్యత్ లో అన్ని రకాల మైనారిటీ ఉద్యోగుల హక్కులను కాపాడటంతో పాటు వారి యోగక్షేమాల నిమిత్తం వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నూతన అడహక్ కమిటీ అన్ని అధికారాలు కలిగి ఉంటుందని తీర్మానించారు. కమిటీ ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబడుతుందని తెలిపారు. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

ఉపాధ్యక్షులుగా గులాం దస్తగిరి, జావీద్, మహమ్మద్ మహబూబ్ అలీ, మహమ్మద్ ఉస్మాన్, సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా  మహమ్మద్ తాహెర్, అదనపు ప్రధాన కార్యదర్శులుగా  మహమ్మద్ ఇస్మాయిల్, కోశాధికారి మీర్ మునవర్ అలీ, సంయుక్త కార్యదర్శులుగా  మహమ్మద్ హనీఫ్,  మహమ్మద్  ఇలియాస్,  మహమ్మద్ సిరాజుద్దీన్ ఖాన్, మహమ్మద్ అల్తాఫ్, ఎస్.విజయుడు, మహిళా కార్యదర్శిగా పర్వీన్ సుల్తానా, సలహాదారులుగా వరకుమార్(రిటైర్డ్ ఎంఈఓ), అనిల్ కుమార్(రిటైర్డ్ జిహెఎం), తాజుద్దీన్ ఎన్నికయ్యారు.