calender_icon.png 18 July, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై నవజాత మగ శిశువు

17-07-2025 01:26:09 AM

జనగామ, జులై 16 (విజయ క్రాంతి): ఈ రోజు ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో, చైల్ హెల్ప్లైన్ 1098 కి ఫోన్ ద్వారా సమాచారం అందింది జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలోని కిలాషాపూర్ గ్రామంలో ఓ నవజాత మగ శిశువుని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళారు. సమాచారం అందిన వెంటనే డిస్ట్రిక్ట్ చైల్ ప్రొటెక్షన్ యూనిట్ , చైల్ హెల్ప్లైన్, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో శిశువు రక్షణ చర్యలు చేపట్టబడ్డాయి.

నవజాత మగ శిశువు మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , రఘునాథపల్లికి తరలించగా, అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. తక్షణమే మెరుగైన చికిత్స కొరకు మహిళా శిశు ఆరోగ్య కేంద్రం, జనగాంకు పోలీస్ డిపార్ట్మెంట్ చైల్ వెల్ఫేర్ చైల్ వెల్ఫేర్ సమక్షంలో పర్యవేక్షణలో  బాలుడిని తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని ఎంసిహెచ్ సూపరింటెండెంట్ డా. మధుసూదన్ అన్నారు. ౄr ఉదయ్ పీడియాట్రిషన్ ఆధ్వర్యంలో శిశువు వైద్య పర్యవేక్షణలో ఉంచబడి, అవసరమైన బేసిక్ స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్నాయి.

డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ డి ఫ్లోరెన్స్ , ఎం సి హెచ్ సూపర్డెంట్ మధుసూదన్ , రఘునాథ్ పల్లి సీఐ మరియు ఎస్‌ఐ పోలీస్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవికాంత్, చైల్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్  రవికుమార్ డీసీపీయూ సీహెచ్‌ఎల్ సిబ్బంది, ప్రణయ్, లావణ్య, ఐసీపీఎస్ సూపర్వైజర్ సరస్వతి మరియు కిలాషాపూర్ అంగన్వాడీ టీచర్లు రేణుక, రుచేంద్ర, ఆశా వర్కర్లు శాంత ఉన్నారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి డీ ఫ్లోరెన్స్  మాట్లాడుతూ పిల్లలను చట్ట విరుద్ధంగా వదలడం లేదా చట్టబద్ధేతరంగా దత్తత ఇవ్వడం తీసుకోవడం జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం - 2015 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది ఇలాంటి చర్యలకు గరిష్టంగా 3 సంవత్సరాల జైలుశిక్ష మరియు 1,00,000 జరిమానా విధించవచ్చు.

చట్టబద్ధమైన దత్తత కోసం www.cara.wcd.gov.in వ్బుసైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం బాలల పరిరక్షణ విభాగం,  చైల్ హెల్ప్లైన్ 1098, ICౄS కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం లేదా జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించగలరు అని అన్నారు.