calender_icon.png 18 July, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

18-07-2025 03:39:37 PM

హైదరాబాద్: భారత వాతావరణ శాఖ (India Meteorological Department) శనివారం హైదరాబాద్‌తో సహా 10 తెలంగాణ జిల్లాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో  కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, ఫిలింనగర్, మణికొండ, టోలిచౌకి, మెహదీపట్నం, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, చందానగర్, కోఠి, చంద్రాయణ్ గుట్ట, మియాపూర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, చిలకలగూడ, బేగంపేట్, ఆల్వాల్, తిరుమల గిరి, బోల్లారం, బోయిన్ పల్లి, మారేడుపల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, నాగారం, మూషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, కావాడిగూడ, భోలక్ పూర్, చిక్కడపల్లి, ఖైరతాబాద్, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాలో జోరుగా వాన కురుస్తోంది. భారీ వర్షానికి ఎక్కడి వాహనదారులు అక్కడ నిలిచిపోయారు. వర్షపు నీరు చేరడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ,రేపు, ఎల్లుండి పలుజిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి.  అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలీ మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఇవాళ ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి.

ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదనంగా, 33 జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు,  బలమైన ఉపరితల గాలులు సంభవించే అవకాశం ఉంది. రాబోయే 24 గంటలు హైదరాబాద్,  దాని పరిసర ప్రాంతాలలో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుంది. "సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 32°C, 22°C వరకు ఉండే అవకాశం ఉంది" అని బులెటిన్ తెలిపింది.