18-07-2025 02:37:50 PM
హైదరాబాద్: హుస్నాబాద్ పట్టణంలో ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar ) ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై వెంటనే అధికారులతో చర్చించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురయ్యే సమస్యల పై మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ 2024-25 సర్వేలో జాతీయ స్థాయిలో హుస్నాబాద్ మున్సిపాలిటీ(Husnabad Municipality)కి 139 వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొత్తం 150 మున్సిపాలిటీతో పోటీపడి 9 వ ర్యాంక్, జిల్లా స్థాయిలో 1 వ ర్యాంక్ సాధించి ODF++ సర్టిఫికేట్ పొదండం పోట్ల మున్సిపల్ అధికారులకు ,సిబ్బంది పొన్నం ప్రభాకర్ అభినందించారు. పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని.. గ్రామగ్రామ స్టీల్ బ్యాంక్ పంపిణీ చేస్తున్నామని పెళ్ళిళ్ళు శుభకార్యాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దని స్టీల్ సామాగ్రి వాడాలని ఆయన సూచించారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వైద్య సదుపాయాల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు.