calender_icon.png 18 July, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లపై సీఎం చెప్పేవి అవాస్తవాలు

17-07-2025 01:24:52 AM

-ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

- తెలంగాణలో బీజేపీ, టీడీపీ రిమోట్ పాలన

- క్లబ్బులకు రానన్న సీఎం ప్రెస్‌మీట్ మాత్రం సెవన్‌స్టార్ హోటల్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ఏపీ మంత్రిమో బనకచర్లపై చర్చించాం, కమిటీ ఏర్పడబోతోందని అంటే బనకచర్ల చర్చకే రాలేదని అబద్దాలు చెప్పినందుకు రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

ఇరురాష్ట్రాల సీఎంల భేటీలో బనకచర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదని మీడియాకు లీకులు ఇచ్చి పరుగు పరుగున ఢిల్లీకి వెళ్లి బనకచర్లపై కమిటీకి ఒప్పుకోవడం చంద్రబాబుకు గురు దక్షి ణ చెల్లించుకునేందుకే అని ఆయన మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వ హించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ కేటీఆర్ సవాల్ విసిరి తే క్లబ్బులకు రానన్న సీఎం రేవంత్ ఢిల్లీలో మాత్రం సెవన్‌స్టార్ హోటల్ లీలా ప్యాలెస్ లో ప్రెస్‌మీట్ పెట్టారని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ లో తెలంగాణ భవన్, సీఎం అధికారిక భవ న్ ఉన్నా అక్కడ మీడియా సమావేశం నిర్వహించలేదని, రేవంత్ మాటలకు చేతకు పొం తన లేదని విమర్శించారు. సీడబ్ల్యూసీ, జీఆర్‌ఎంబీ, పోలవరం ప్రాజెక్టు ఆథార్టీ మూడు సంస్థలు ఏపీ డీపీఆర్‌ను, బనకచర్లపై ఫ్రీ ప్రిజబుల్టీ రిపోర్డును తిరస్కరించా యన్నా రు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా అ నుమతి నిరాకరించినా బనకచర్లపై కేంద్రం మీటింగ్ నిర్వహించడమే తప్పు అని, తిరిగి దానిపై కమిటీ వేయడం ఏమిటని ప్రశ్నించారు.

విభజన చట్టం ప్రకారం జీఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలని ఉంటే కమిటీ వేయడం, దానికి సీఎం సంతకం పెట్టడం ఏందన్నారు. సీఎం ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. రా ష్ట్రాని కి అన్యాయం జరిగితే పోరాటం చే స్తానని, సుప్రీంకోర్టుకు వెళ్తానని సీఎం చెప్పేదిపోయి ఒప్పుకుంటా అని ఎలా చెప్తారని ప్రశ్నించారు.

సీఎం సంతకం పెట్టడంతో రేవంత్ తెలంగాణకు మరణశాసనం రాయడేమేనని మం డి పడ్డారు. అపెక్స్ కమిటీ మీటింగ్‌కు డిమాం డ్ చేయకుండా, ఇంటర్నల్ మీటింగ్‌కు సీఎం ఎందుకు వెళ్లారని, ఈ భాయ్ భాయి మిలాఖత్, చంద్రబాబు, బీజేపీలతో చీకటి ఒప్పం దం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని ద్రోహాం చేసిన వ్యక్తిని రాష్ట్ర సలహాదారుడిగా ఎలా పెట్టుకుంటారని  నిలదీశారు. 

పేరుకే రేవంత్ పాలన 

పేరుకే రేవంత్ పాలన అని, నామినేటెడ్ పదవులు బాబు కనుసన్నల్లో జరుగుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. చంద్ర బా బును విమర్శించాల్సింది పోయి సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో కూటమి పాలన, తెలంగాణలో విషకూటమి పాలన నడుస్తోందన్నారు. టెలిమె ట్రీ కొత్తదేమి కాదని, పోతిరెడ్డిపాడు వరకు తమ హయాంలోనే పెట్టారన్నారు. కృష్ణాలో 500 టీఎంసీలు చాలని చెప్పడానికి సీఎం ఎవరని ప్రశ్నించారు.

నోటీ తీట తప్ప నీటి వాటా తేవాలనే చిత్తశుద్ది లేదన్నారు. ఈ ద్రోహానికి సీఎంని ఎన్ని కొరడా దెబ్బలు కొ ట్టినా తక్కువేనని, నీళ్ల విషయంలో నిజాయితీగా ఉండాలని, లేకపోతే తెలంగాణ ప్రజలు నీళ్లలో ముంచుతారని హితవు పలికారు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి, నియమకాలు తెలంగాణ ద్రోహులకు అన్నట్లుగా పాలన సాగుతోందని మండిపడ్డారు. తాము ఎట్టి పరిస్థితుల్లో బనకచర్లను ఒప్పుకోమని, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ము ఖ్యమన్నారు. బాబు ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందం తేటతెల్లమైందన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యా యంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాస్తే స్పందన లేదని హరీశ్ విమర్శించారు.