18 August, 2026 | 8:00 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం

24-05-2026 03:23 PM

బోథ్,(విజయక్రాంతి): నేరడిగొండ మండలంలోని వడూర్ బుద్ధికొండ రహదారి పైన ఆదివారం ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో పులి సంచరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఆ రహదారి మీదుగా వెళుతున్న వారు పులిని చూసినట్లు పేర్కొంటూ ఫోటోలు పెట్టడం జరిగింది. వడూర్ అడవుల్లో నుండి వెళ్లిన పులి రోడ్డు దాటుతూ కనిపించిందని పేర్కొంటున్నారు.

కాగా పులి సంచారం పైన వాస్తవాలను తెలుసుకునేందుకు విజయ క్రాంతి సంబంధిత అటవీ శాఖ అధికారి గణేష్ ని వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని పులి సంచరిస్తున్నది వాస్తవమా కాదా అని తెలుసుకునేందుకు సిబ్బందితో పాటు వెళ్లడం జరిగిందని మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు పులి పాదముద్రలు ఎక్కడ కనిపించలేదని పేర్కొన్నారు. ఇంకా తమ సిబ్బంది తో పాటు పాద ముద్రలు గుర్తించే పనిలో ఉన్నామని పులి ఉన్నట్లు తేలితే ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు.