నెక్ట్స్ రామ్‌చరణ్‌తోనే..
ప్రస్తుతం హీరో రామ్ చరణ్ ఒకవైపు ‘గేమ్ చేంజర్’, మరోవైపు బుచ్చిబాబు సాన చిత్రం ‘ఆర్‌సీ 16’తో బిజీగా ఉన్నారు. అయితే గతంలో హోలీ పండుగ నేపథ్యంలో రామ్ చరణ్ తాను సుకుమార్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ చిత్రం విడుదలతో ఫ్రీ అయ్యారు. ఆయన కాస్త విశ్రాంతి తీసుకున్న మీదట రామ్ చరణ్‌తో సినిమాపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం ‘ఆర్‌సీ 17’గా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. సంగీత దర్శకుడు సైతం దేవిశ్రీ ప్రసాదేనని సమాచారం. ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌సీ 16’కి కూడా సుకుమార్ తన వంతు సహకారం అందిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో ఈమెకు ఇది రెండో సినిమా కావడం గమనార్హం.






