విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రణయ గోదారి
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా, సాయికుమార్ ముఖ్య పాత్రలో రాబోతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని పీఎల్‌వీ క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ను ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ చిత్రబృందం అంతా కలిసి ఓ చిన్నారి గుండె ఆపరేషన్ కోసం ఆర్థిక విరాళాన్ని అందించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ‘అమ్మ ప్రసవించే సమయంలో ఎలాంటి స్థితిలో ఉంటుందో.. సినిమా రిలీజ్ టైంలో నిర్మాత కూడా అలానే ఉంటాడనిపించింది’ అన్నారు. విఘ్నేశ్ మాట్లాడుతూ.. ‘నా అన్న మార్కండేయ కోసం ఈ మూవీని చేశాను. కానీ రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాను’ అని తెలిపారు. కార్యక్రమంలో రాజ్ కందుకూరితోపాటు ప్రియాంక ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ, నటి ఉషాశ్రీ పాల్గొన్నారు.






