26 July, 2026 | 2:15 AM

న్యూరో సర్జరీలో చారిత్రక ఘనత సాధించిన నిమ్స్

26-07-2026 12:00 AM

పంజాగుట్ట, జూలై 25 (విజయక్రాంతి): ఫంక్షనల్ న్యూరోసర్జరీ రంగంలో చారిత్రక ఘనతను నిమ్స్ సాధించింది. కేవలం రెండు గంటల వ్యవధిలోపే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్రచికిత్సలతో పాటు వణు కు వ్యాధికి అత్యాధునిక ఎంఆర్‌ఐ గైడెడ్ రేడియోఫ్రిక్కెన్సీ చికిత్సను హాస్పిటల్ వైద్య సిబ్బంది అందించింది. ఈ విషయమై శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడారు.

ప్రభుత్వ వైద్య సంస్థలోనే ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తూ అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం నిమ్స్ లక్ష్యమని తెలిపారు. తక్కువ సమయంలో అత్యంత ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించడం ద్వారా రోగులకు మెరుగైన ఫలితాలు, వేగవంతమైన కోలుకోవడం సాధ్యమవుతుంద ని పేర్కొన్నారు. ఖరీదైన చికిత్సలను కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్ర జలకు అందించడం నిమ్స్ ప్రత్యేకత అని అ న్నారు.

అరుదైన ఘనతను సాధించిన న్యూ రోసర్జరీ విభాగం వైద్యులను అభినందించారు. న్యూరోసర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ వై. వంశీకృష్ణ రెండున్నరేళ్లలో 200కు పైగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామన్నా రు. తద్వారా ఫంక్షనల్ న్యూరోసర్జరీలో దేశంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిందని వెల్లడించారు. అదే విధంగా న్యూరోజెనిక్ బ్లాడర్ సమస్యతో బాధపడుతున్న రోగులకు సాక్రల్ న్యూరోమాడ్యులేషన్ సేవలను కూడా హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగం వైద్యులు శిరీష, వసుంధర తదితరులు పాల్గొన్నారు.