14 May, 2026 | 10:54 PM

నాయకుల మద్దతు కోరిన నీలం మధు

23-04-2024 02:02 AM

పటాన్‌చెరు, ఏప్రిల్ 22 : కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మెదక్ ఎంపీగా విజయం సాధించేందుకు మద్దతు కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులను వారి నివాసాలకు వెళ్లి కలుస్తున్నారు. పటాన్‌చెరు మండలంలోని భానూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ మేఘమాల శ్రీహరి, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్‌రెడ్డిలను కలిసి శాలువాతో సన్మానించి వారితో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి వారు ఇచ్చిన పలు సల హాలు, సూచనలను తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అంద రూ సహకరించాలని నీలం మధు కోరారు. మెదక్ ఎంపీగా గెలుపొందేందుకు తమ వంతు సహకారం అందిస్తామని భానూర్ గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ యాదగిరి, మాజీ ఉపసర్పంచ్ నసీంఇక్బాల్, నాయకులు శ్రీనివాస్, ప్రభు, శివయ్య తదితరులు పాల్గొన్నారు.