calender_icon.png 6 July, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ సుంకాలకు మోదీ తలొంచుతారు

06-07-2025 01:30:31 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, జూలై 5: అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు సమీపిస్తుందని ఆదరాబాదరాగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోమని వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పం దించారు.

‘అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోదీ తప్పక తలవంచుతారు. నా మాటలు నమ్మకపోతే రాసిపెట్టుకోండి.’ అని వ్యాఖ్యానిం చారు. అమెరికా వివిధ దేశాలకు సుంకాల విషయంలో ఇచ్చిన గడువు 9తో ముగుస్తున్నందున అంతకంటే ముందే నూతన వాణిజ్యవిధానాన్ని ప్రకటించాలని రెండు దేశాలు చూస్తున్నాయి.

  అంతకుముందు వాణిజ్య ఒప్పందాల ను ఖరారు చేసుకునేందుకు దేశం ఎప్పుడూ తొందరపడదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నా రు. అమెరికాతో కుదుర్చుకోనున్న ఒప్పందంలో భాగంగా భారత్ కొన్ని రంగాల్లో సుంకాల నుంచి అగ్రరాజ్యాన్ని సడలింపు కోరనుంది.  టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, ప్లాస్టిక్స్, రొయ్యలు, నూనె గింజలు తదితర వస్తువులున్నాయి.