calender_icon.png 25 December, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌కు శ్రీకారం

25-12-2025 01:13:12 AM

  1. ఆర్వీ అసోసియేట్స్‌కు బాధ్యతలు 
  2. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం 
  3. బరాజ్‌ల మరమ్మతులకు ముందడుగు 
  4. ప్రతి బరాజ్‌కు వేర్వేరుగా మరమ్మతుల ప్రణాళికలు

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజె క్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రాజెక్ట్ పరిధిలోని మూడు బరాజ్‌లకు అవసరమైన మరమ్మతులు, భవిష్యత్ భద్రతా ఏర్పాట్లపై డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ (డీపీఆర్) సిద్ధం చేసేందుకు ‘ఆర్వీ అసో సియేట్స్’ అనే కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పగుళ్లు, నిర్మాణ లోపాలు, భద్రతాపరమైన సమస్యలపై సమగ్రంగా స్పందిస్తూ ప్రభుత్వం మరమ్మతుల దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగానే తాజాగా డీపీఆర్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. బ్యారేజీల నిర్మా ణ స్థిరత్వం, సీపేజ్ సమస్యలు, గేట్ల పనితీరు, కాంక్రీట్ నాణ్యత తదితర అంశా లపై లోతైన సాంకేతిక అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన ట్టు సమాచారం. అవసరమైతే డిజైన్ మార్పులు, నిర్మాణ బలపరిచే చర్యలు కూడా సూచించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

డీపీఆర్‌లలో భాగంగా ప్రతి బ్యారేజీకీ వేర్వేరు గా మరమ్మతుల వ్యూహం రూపొందించనున్నారు. అవసరమైతే నిర్మాణ బలపరిచే పను లు, డిజైన్ మార్పులు, అదనపు రక్షణ చర్యలు సూచించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ అధ్యయనం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు దీర్ఘకాలిక భద్రతను నిర్ధారించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

తుమ్మిడిహట్టికీ డీపీఆర్

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తుమ్మిడిహట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఈ నివేదికను మూడు నెలల్లో ప్రభుత్వానికి అందజేయాలని సంబంధిత సం స్థకు గడువు విధించినట్టు సమాచారం. కాళేశ్వ రం అనుబంధ ప్రాజెక్టుల భవిష్యత్ ప్రణాళికలో తుమ్మిడిహట్టి కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ డీపీఆర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డీపీఆర్‌లు ప్రభుత్వానికి అందిన వెంటనే మరమ్మతుల పనులకు టెండర్లు పిలి చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

పనుల వ్యయం, కాలపరిమితి, అమ లు విధానం అన్నీ డీపీఆర్ సూచనల ఆధారంగానే ఖరారు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు తెలంగాణకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు కావడంతో, రైతులకు నీటి సరఫరా, ప్రాజెక్టు భద్రత, దీర్ఘకాలిక స్థిరత్వం అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మరమ్మతుల పనుల ద్వారా భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న ఈ తాజా నిర్ణయాలు, ప్రాజెక్టు భద్రతపరంగా కీలక మలుపుగా మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.