07-11-2025 01:24:23 AM
* ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. తెలంగాణకు జీవనాడిగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల్లో పలు లోపాలను కనుగొన్నా, ఇప్పటివరకు ప్రాజెక్టును పునరుద్ధరించే పనులు ఒక్క అంగుళంకూడా ముందుకు సాగలేదు. మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన 7వ బ్లాక్ పునరుద్ధరణ పనులు ఎవరు చేస్తారనే దానిపైనా ఇంకా స్పష్టత రాలేదు.
కాంట్రాక్టు సంస్థపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. తాజాగా నోటీసు జారీచేసి.. మా పని అయిపోయిందనే చందంగా చేతులు దులుపుకుంది. పైగా ఇదే సమయంలో అదే కాంట్రాక్టు సంస్థ.. ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రో రైలు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తన నెత్తిన వేసుకుంది.
మెట్రో రైలు ప్రాజెక్టు కోసం చేసిన రూ. 13,500 కోట్ల అప్పును టేకోవర్ చేయడంతోపాటు, ఎల్ అండ్ టీకి రూ. 2,000 కోట్లు ఇవ్వడంతో.. మొత్తం రూ. 15,500 కోట్ల భారాన్ని రాష్ట్ర సర్కారు తలకెత్తుకుంది. కాళేశ్వరంలో మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ కోసం అటు విజిలెన్స్ నివేదికలో, ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో..
కాంట్రాక్టు సంస్థ అయిన ఎల్ అండ్ టీడూ (జేవీ)దే బాధ్యత అంటూ స్పష్టం చేసినా.. ప్రభుత్వం నుంచి ఇంకా చర్యలేవీ లేవు. ఇన్ని రోజుల తరువాత, ఎట్టకేలకు నోటీసులు మాత్రం జారీచేసింది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకూడా హైదరాబాద్ మెట్రో లాగానే ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
మెట్రో నుంచి ఎల్ అండ్ టీకి విముక్తి.. రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 15,000 కోట్ల భారం
ఇదే తరహాలో మేడిగడ్డ బరాజ్ కూడా ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందనే అనుమానాలు
బరాజ్‌కి మరమ్మత్తులను కాంట్రాక్టు ఏజన్సీతో చేయించాలన్న విజిలెన్స్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలు
తాజాగా ఎల్ అండ్ టీకి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న నీటిపారుదల శాఖ
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : కాళేశ్వ రం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన 7వ బ్లాక్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి మరమ్మతులు ఎప్పుడు చేస్తుందో అనేది అంతుపట్టని విధంగా ఉంటే.. ఎవరు చేస్తారనేదికూడా ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. అటు విజిలెన్స్ నుంచి వచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోకూడా చర్యలు తీసుకోవాలని ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కపెడుతున్నట్టుగా సాగునీటి రంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే తాజాగా కాంట్రాక్టు సంస్థకు నోటీసులు మాత్రం నీటిపారుదల శాఖ నుంచి జారీఅయ్యాయి.
చర్యల కొరడా ఎప్పుడు..?
వాస్తవానికి రెండు సంస్థలు ఇచ్చిన నివేదికల్లోనూ కాంట్రాక్టు సంస్థ అయిన ఎల్ అండ్ టీ పీఈఎస్ (జేవీ) సంస్థ తన సొంత ఖర్చులతో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఆ దిశగా రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. విజిలెన్స్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలు వచ్చిన సుమారు మూడున్నర నెలల తరువాత ఎల్ అండ్ టీకి నోటీసు జారీచేశారు. ఇంతకాలం గోళ్లు గిల్లుకున్న నీటిపారుదల శాఖ తాజాగా నోటీసులు జారీ చేయడంపై సాగునీటిరంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు.
నివేదికలు ప్రభుత్వానికి చేరిన తరువాత వెంటనే నోటీసులు జారీచేసిఉంటే.. కనీసం ఇప్పటికి సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉండేదని, ఒకవేళ ఎల్ అండ్ టీ మొం డిగా వ్యవహరిస్తే.. కనీసం జరిగిన నష్టం ఎంతో కొంత మొత్తం రికవరీకి ప్రక్రియ మొదలయ్యి ఉండేదని వారంటున్నారు. 7వ బ్లాక్ కుంగి రెండేళ్లు గడిచిన తరువాతకూడా కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై, అసలు ఎవరు చేస్తారనేదానిపై ఇంకా ప్రభుత్వానికే స్పష్టత రాలేదేమోనని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మెట్రోను వదిలించుకున్న ఎల్ అండ్ టీ..
కాళేశ్వరంపై రగడ జరుగుతుండగానే.. హైదరాబాద్ మెట్రో రైలును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ తమ బాధ్యతల నుంచి తప్పుకుని ఆ భారా న్ని సర్కారు నెత్తిన మోపింది. అటు కాళేశ్వరం, ఇటు మెట్రో రైలు విషయంలో మరింత పట్టుగా ముందుకు సాగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనో.. ఎల్ అండ్ టీ పై ఒకింత జాలి చూపించారనే ఆరోపణలు లేకపోలేదు. పైగా ఎల్ అండ్ టీ మెట్రోలో పైస్థాయిలో ఉన్న ఒక అధికారి రిటైర్మ్‌ంట్ అయిన వెంటనే ప్రభుత్వంలో సలహాదారుగా నియమించుకోవడం..
ఆపై వెంటనే మెట్రో బాధ్యతల నుంచి ఎల్ అండ్ టీ తప్పుకుని.. నిర్మాణం కోసం చేసిన రూ. 13,500 కోట్ల అప్పులను, అలాగే తమకు రావాల్సిన రూ. 2,000 కోట్లను రాబట్టుకుని ఎల్ అండ్ టీ చాకచక్యంగా తప్పించుకుందనే ప్రచారంకూడా ప్రజల్లో ఉంది. ఇదే సమయంలో.. ప్రజల ధనాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం మాత్రం.. అప్పుల భారాన్ని, ఇకపై మె ట్రో నిర్వహణ భారాన్ని తనపై వేసుకుని ఎల్ అండ్ టీ సంస్థకు టాటా చెప్పేసింది. ఇందుకు అనేక సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తున్నది.
మరో మెట్రోగా కాళేశ్వరం..
గడిచిన రెండేండ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర వివాదం తలెత్తింది. మేడిగడ్డ బరా జ్‌లో 7వ బ్లాక్ కుంగిపోయింది. అటు విజిలెన్స్, ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చి న నివేదికల్లో కాంట్రాక్టు సంస్థ అయిన ఎల్ అండ్ టీపీఈఎస్ (జేవీ)దే బాధ్యత అని తేల్చి చెప్పినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. తాజాగా కాంట్రా క్టు సంస్థపై చర్యలకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టిన సంకేతాలు వస్తున్నాయి. ఇంతటి కీలకమైన అంశంపై కుతకుతమంటూ అన్ని వర్గాలు ఉడుకుతుంటే.. తాపీగా మెట్రో నుం చి ఎల్ అండ్ టీ తప్పుకోవడంపై పలు అనుమానా లు వ్యక్తమవుతున్నాయి.
ఇక మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులను తప్పకుండా చేపట్టాల్సిన ఎల్ అండ్ టీ సంస్థపై ఎందుకనో రాష్ట్ర ప్రభుత్వం కాస్త సానుభూతితో ముందుకు సాగుతున్నదా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు, సా గునీటి రంగ నిపుణులు వ్యక్తంచేస్తుండటం గమనార్హం. అంటే కాళేశ్వరం కూడా మరో మెట్రో లాగా ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందా అనే చర్చ సాగుతున్నది. అలా జరిగితే మాత్రం.. ప్రజలపై మరింత భారం వేయడమే అనేది స్పష్టం.
కనీసం ఇప్పటికైనా ఎల్ అండ్ టీ విషయంలో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకో వాలని, మేడిగడ్డ బరాజ్‌ని పునరుద్ధరించడానికి తగిన న్యాయపరమైన, చట్టపరమైన కసరత్తును వేగంగా పూర్తిచేసి పునరుద్ధరణ పనులను పూర్తిచేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికే రెండు సీజన్లు గడిచిపోయాయి. వచ్చే మూడో సీజన్‌లోనైనా కాళేశ్వరం నుంచి ఫలాలు రాష్ట్రానికి అందుతా యని ప్ర జలు ఆశిస్తున్నారు.
ఇక కాళేశ్వరాన్ని కూడా మెట్రో లాగా చేస్తుందా.. కాంట్రాక్టు సంస్థకు తాజాగా నోటీసులు జారీచేసిన ప్రభుత్వం.. ఇకనైనా వేగంగా చర్యలు తీసుకుంటుందా.. లేక ఇప్పటి వరకు జరిగిన తాత్సారం వల్ల ఈ భారాన్ని సర్కారు తనపైనే వేసుకునేందుకు సిద్ధమవుతున్నదా, లేక చట్ట ప్రకారం ఎల్ అండ్ టీతో పను లు చేయిస్తుందా.. అనేది సర్కారు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
విజిలెన్స్ నివేదికలో..
* మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంట్రాక్టు సంస్థ (ఎల్ అండ్ టీ-పీఈఎస్ (జేవీ) సంస్థపై చర్యలు తీసుకోవాలి. ఆర్‌ఈ-1 సప్లిమెంటల్ అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తిచేయకుండానే పూర్తయినట్టుగా సర్టిఫికెట్ తీసుకున్నారు. అలాగే ఈ విషయాన్ని చెప్పకుండానే ఆర్‌ఈ-2 సప్లిమెంటల్ అగ్రిమెంట్‌ను రూ. 4,613 కోట్లకు కుదుర్చుకున్నారు. అయినా ఆర్‌ఈ-1, ఆర్‌ఈ-2లో పెండింగు పనులు అలాగే ఉన్నాయి.
* మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ పునరుద్ధరణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కాంట్రాక్టు సంస్థ అయిన ఎల్ అండ్ టీ-పీఈఎస్ (జేవీ) నుంచి రికవరీ చేయాలి. వాస్తవానికి బరాజ్ పనులను తప్పుగా చేపట్టారు. సీకెంట్ పైల్స్ విషయంలో తప్పు జరిగింది. అందువల్లే 7వ బ్లాక్ కుంగింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో..
* మేడిగడ్డ బరాజ్ విషయంలో సబ్‌స్టాన్షియల్ కన్‌స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్ (9.9.2019), సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ (15.3.2021) ఇవ్వడం చాలా త ప్పు. చట్ట విరుద్ధం. కేవలం కాం ట్రాక్టు సంస్థకు లాభం చేకూర్చేందుకే, పనులు పూర్తి కాకున్నా.. చేసిన పనుల్లో లోపాలున్నా పనులు పూర్తయినట్టుగా సర్టిఫికెట్ ఇచ్చారు.
* కాంట్రాక్టులో పొందుపర్చిన అంశాల ప్రకారం.. మేడిగడ్డ బరాజ్‌కి కలిగిన నష్టం బాధ్యత కాంట్రాక్టు సంస్థ అయిన ఎల్ అండ్ టీ (జేవీ) సంస్థదే. ప్రాజెక్టు అధికారులు పలు దఫాలుగా రాసిన లేఖల్లో పేర్కొన్న అంశాల ప్రకారం.. బరాజ్‌ని పూర్తిగా పునరుద్ధరించే బాధ్యత కాంట్రాక్టు సంస్థదే.