13-12-2025 10:09:08 PM
హనుమకొండ (విజయక్రాంతి): నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పనిచేసే అసోసియేట్ ప్రొఫెసర్ పి. వెంకట సుబ్బారెడ్డి ధర్మసాగర్ రిజర్వాయర్లో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం రిజర్వాయర్లో గుర్తుతెలియని మృతదేహాన్ని గమనించిన స్థానికుల ఫిర్యాదు మేరకు ధర్మసాగర్ పోలీసులు గుర్తించారు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేల్ గ్రామంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.