13-12-2025 10:47:11 PM
అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి
చివ్వెంల (విజయక్రాంతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పూర్తిగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాల్సిందిగా సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. శనివారం రాత్రి చివ్వెంల మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది, పోలింగ్ అధికారులతో సమావేశమై ఎన్నికల విధులు అత్యంత బాధ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేస్తూ, శాంతిభద్రతలు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై మహేశ్వర్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.