calender_icon.png 13 December, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంగునూరు పోలింగ్ బూత్‌ను సందర్శించిన ఏసీపీ

13-12-2025 10:26:46 PM

నంగునూరు: నంగునూరు మండలంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి శనివారం నంగునూరు పోలింగ్ బూత్‌ను సందర్శించారు. పోలింగ్ కేంద్రంలోని భద్రతా ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రం వద్ద అనుసరించాల్సిన బందోబస్తు ప్రణాళిక, భద్రతా చర్యలపై వారికి పలు కీలక సూచనలు చేశారు. ఓటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రం లోపల, వెలుపల అనుమానాస్పద కార్యకలాపాలు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.