calender_icon.png 14 December, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి..!

13-12-2025 10:19:36 PM

మంచిర్యాల డీసీసీ భాస్కర్

బెల్లంపల్లి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్ కోరారు. శనివారం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ గ్రామమైన నాయకంపేట గ్రామాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో అభ్యర్థులతో కలసి గ్రామస్తులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎవరైనా ఓటర్లను భయపెట్టిన మరి ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు గురిచేసినా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ హెచ్చరించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.

అభ్యర్థులు బెదిరింపులకు పాల్పడితే చర్యలతో పాటు వారి ఎలక్షన్ అభ్యర్థిత్వాన్ని డిస్క్ క్వాలిఫై చేయబడుతుందని హెచ్చరించారు. ఎలక్షన్స్ సందర్భంగా ఓటర్లను ప్రలోబపెట్టేందుకు  మద్యం, డబ్బు ఇతర వస్తువులు ఏమైనా పంపిణీ చేసినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి గొడవలు చేసినా కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సీఐ దేవయ్య, కన్నెపల్లి ఎస్ఐ భాస్కర్ రావు, బందోబస్తుకు వచ్చిన హాజీపూర్ ఎస్ఐ పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలో ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు.