calender_icon.png 14 December, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు వర్గ విభేదాలకు, గొడవలకు పోవద్దు

13-12-2025 10:37:51 PM

ప్రశాంత ఎన్నికకు ప్రతి ఒక్కరు సహకరించాలి

మోతే (విజయక్రాంతి): మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు, ఆంక్షలు అమలు చేయాలని కోరారు. లెక్కింపు ప్రక్రియ సమయంలో తప్పుడు సమాచారం వెళ్లకుండా అభ్యర్థులను లెక్కింపు ప్రారంభంలోనే కూర్చోబెట్టుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో పోలీస్ సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించడం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ గ్రామాలలో ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలని వర్గ వివాదాలకు పోవద్దు, గొడవలు తగాదాలు పెట్టుకోవద్దు అని కోరారు.

ప్రజాస్వామ్య దేశంలో ఓట్లు పండుగలా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులంతా ఒక ఊరు వారే ఉంటారు కాబట్టి కలిసిమెలిసి ఉండాలి. యువత ఆదర్శంగా ఉండాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు వరుస క్రమంలో నిలబడలని అన్నారు. ఎన్నికల అధికారులకు పోలీసు సిబ్బందికి ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని తెలిపారు. ఎస్పీ వెంట మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, మోతే ఎస్ఐ అజయ్, ఎస్ఐ సైదులు, అర్ముడ్ ఎస్ఐ లు అశోక్, సాయిరాం, సిబ్బంది ఉన్నారు.