1 April, 2026 | 1:59 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

ఫేక్ వీడియోలపై ఫిర్యాదు తీసుకోవడం లేదు

03-05-2024 01:03 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు  

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని కొందరు తనపై ఫేక్ వీడియోలు చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేశారని, వారిపై ఫిర్యాదు చేస్తే 10 రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అమలు చేస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లుగా అమిత్‌షాపై తప్పుడు వీడియోలు వైరల్ అయ్యాయని, దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారన్నారు. తన ఫిర్యాదుపైనా పోలీసులు అలాగే స్పందించాలని డిమాండ్ చేశారు.