13-11-2025 12:00:00 AM
- టిఎస్‌ఎస్‌ఓ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మీనివాస్
- ఆమనగల్ లో డ్రగ్స్ అవగాహన ర్యాలీ
అమనగల్లు, నవంబర్ 12: డ్రగ్స్ వద్దు.. లైఫ్ ముద్దు అనీ టిఎస్‌ఎస్‌ఓ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మీనివాస్ అన్నారు. బుధవారం ఆమనగల్ లో డ్రగ్స్ అవగాహన ర్యాలీని తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ (టి.ఎస్.ఎస్.ఓ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణి గార్డెన్‌లో విద్యార్థులతో అవగాహన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా టిఎస్‌ఎస్‌ఓ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మీనివాస్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మానవ జీవితాన్ని, ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనం అని పేర్కొన్నారు.
యువత దేశానికి వెన్నెముక, వారు ఆరోగ్యంగా, చైతన్యంగా ఉండాలంటే డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమాజంలో డ్రగ్స్ వ్యతిరేక చైతన్యం కలిగించాలని విజ్ఞప్తి చేశారు. “డ్రగ్స్ మన యువత జీవితాలను నాశనం చేసే మత్తు , మృత్యువుకు దారి తీసే మాయ. విద్యార్థులు క్రమశిక్షణతో జీవించి, దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అన్నారు.
అలాగే “డ్రగ్స్ వద్దు.. లైఫ్ ముద్దు” అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా యువతలో డ్రగ్స్ పట్ల జాగృతి కలిగించడం, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం దిశగా ముందడుగు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శాంతి రేఖ, సీఐ బద్య నాయక్ చౌహన్, ఎస్‌ఐలు. పాపిశెట్టి రాము. టి.ఎస్.ఎస్.ఓ రాష్ర్ట అధికార ప్రతినిధి రమేష్ గౌడ్, టి ఎస్ ఎస్ ఓ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చిక్కి పాల్గొన్నారు.