13-11-2025 12:00:00 AM
మహబూబాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 85 వేల రూపాయల విలువైన 1,750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి కథనం ప్రకారం టౌన్ ఎస్‌ఐ అశోక్ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు పత్తిపాకలో గల ఒక ఇంటిలో తనిఖీలు చేయగా అక్కడ నలుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండి, పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్ర యత్నించగా వెంటనే సిబ్బంది సహకారంతో వారిని పట్టుకుని వారిని విచారించగా మండల సంతోష్ కుమార్,
కోయచెలక గ్రామం, ఖమ్మం, షేక్ షకీల్ కంకరబోర్డు కాలనీ, మహబూబాబాద్, గుగులోతు అనిల్, గండి తండ, కొల్లాపూర్, గూడూరు ఇస్లావత్ సాయి గణేష్ మా ర్కండేయ టెంపుల్ కాలనీ, మహబూబాబాద్ అని చెప్పి వేరే ప్రాంతాల నుండి గంజాయిని త క్కువ ధరకు తెచ్చి స్థానిక యువకులకు ఎక్కువ ధరలకు విక్రయి స్తున్నట్టు ఒప్పుకున్నారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి ఒక ప్యాకింగ్ చేసిన కవర్ లో 85 వేల విలువైన ఒక కిలో 750 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.