13-11-2025 12:58:22 AM
హుస్నాబాద్ ఎస్టీ బాలకల కాలేజీహాస్టల్ లో దుస్థితి
వారంరోజులుగా చీకట్లో జీవనం
బీజేపీ నాయకుల సందర్శనతో వెలుగులోకి
హుస్నాబాద్, నవంబర్ 12 : సిద్దిపేట జి ల్లా హుస్నాబాద్ లోని ప్రభుత్వ గిరిజన బా లికల కళాశాల వసతిగృహంలో విద్యార్థినుల దుస్థితిపై ప్రభుత్వ నిర్లక్ష్యం అక్షరాలా కరెంటు స్తంభించినట్టు తేటతెల్లమైంది. వా రం రోజుల నుంచి కరెంటు లేక విద్యార్థినులు చీకట్లో తీవ్ర అవస్థలు పడుతున్నారని, కనీసం స్నానం చేయడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు భూక్యా సంపత్ బృందం బుధవారం సాయంత్రం వసతి గృహాన్ని సందర్శించిన తర్వాత వెల్లడించింది.
సౌకర్యాలు లేకపోగా, మెనూ ప్ర కారం ఆహారం కూడా పెట్టడం లేదని విద్యార్థినులు తెలిపారు. ఈ విషయాలపై హాస్టల్ వార్డెన్ గాయత్రిని వివరణ కోరగా... ఆమె ఇచ్చిన సమాధానం మరింత విస్మయాన్ని కలిగించిందని సంపత్ అన్నారు. ‘కరెంటు రి పేర్ బిల్లులు మాకు ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్ కు ఇస్తున్నారు.
మేము ఎందుకు చేపిస్తా ము? కాంట్రాక్టర్ ని చేయించమని చెప్పం డి,‘ అని వార్డెన్ నిర్లక్ష్యంగా సమాధానం చె ప్పడం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేసిందని చెప్పారు. ఈ పరిస్థితులపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డీటీడీవోను ఫోన్లో సంప్రదించగా, ఆయన ఫోన్ ఎత్తలేదన్నారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఈ కీలక అంశంపై అధికారుల స్పందన లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.