15 April, 2026 | 2:17 AM

ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు

30-10-2025 12:28 AM

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

నల్గొండ రూరల్, అక్టోబర్ 29 : ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు‘ అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు కళాజాత బృందం బుధవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన విద్యార్థుల ను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ సామాజిక రుగ్మతల రూపుమాపుటలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

తమలోని నైపుణ్యాలను గుర్తించి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని కోరారు. విద్యార్థులు డ్రగ్స్ ను పారద్రోలడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. అనేక ప్రజా పోరాటాల్లో విద్యార్థుల పాత్ర వారి త్యాగాలు మరువలేనివని, చురుకుదనం చలన శీలత కలిగిన యువశక్తి, దేశ ప్రగతికి, సామాజిక మార్పునకు ఉపయోగ పడాలన్నారు. విసి కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు మత్తుకు బానిస అవుతే బంగారు భవిష్యత్తును కోల్పోతారు అన్నారు.

అనంతరం తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు పల్లె నరసింహ బృందం  ఆధ్వర్యంలో గంజాయి మహమ్మారిపై లఘు నాటికను ప్రదర్శనలు విద్యార్థులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, విద్యార్థి నాయకులు, రెహమాన్, మురళి జిల్లా యాదయ్య, అధ్యాపకులు డా మారం వెంకటరమణారెడ్డి, డా అనిత కుమారి, డా ఆనంద్, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.